Kishan Reddy: తెలంగాణకు అప్పుడే తాడిచెర్ల-1 గనులు కేటాయించాం: రాజ్యసభలో కిషన్ రెడ్డి

Kishan Reddy says Tadicherla1 mines already allocated to Telangana
  • 2015 ఆగస్ట్ 31న తెలంగాణ విద్యుత్ సంస్థకు కేటాయించినట్లు వెల్లడి
  • రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో తాడిచెర్ల కోల్ బ్లాక్ గురించి స్పందించిన కేంద్రమంత్రి
  • బొగ్గు గనులను ప్రభుత్వరంగ సంస్థలకు కేటాయించడం లేదన్న తమిళనాడు ఎంపీ
తాడిచెర్ల-1 బొగ్గు గనుల విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. 2015 ఆగస్ట్ 31న తెలంగాణ విద్యుత్ సంస్థకు దీనిని కేటాయించినట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజ్యసభలో వెల్లడించారు. 2019 మార్చిలో ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఆమోదం అనంతరం, 2020 జూన్ నుంచి బొగ్గు గనుల కేటాయింపుల ప్రక్రియ మారినట్లు తెలిపారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో తాడిచెర్ల కోల్ బ్లాక్ గురించి కేంద్రమంత్రి స్పందించారు.

రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కేంద్ర బడ్జెట్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేటాయింపులు లేవని, ఇది తెలంగాణ ప్రజలను నిరాశపరిచిందని అన్నారు.

2020 జూన్ నుంచి బొగ్గు వేలం ప్రక్రియలో ప్రభుత్వరంగ సంస్థలకు బొగ్గు బ్లాక్‌లు కేటాయించలేదని తమిళనాడుకు చెందిన ఎంపీ డాక్టర్ తంబిదురై అన్నారు. వేలం ప్రక్రియలో రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, ప్రైవేటు రంగ కొనుగోలుదారులకు కట్టపెడుతున్నారని ఆరోపించారు. దీంతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ, తెలంగాణ విద్యుత్ సంస్థకు తాడిచెర్ల-1 బొగ్గు గనులను కేటాయించినట్లు తెలిపారు.
Kishan Reddy
Tadicherla coal mines
Telangana
Coal block allocation
Rajya Sabha
Central government

More Telugu News