Chandrababu Naidu: చంద్రబాబు ప్రతిపాదనలను కేంద్రం బుట్టదాఖలు చేసింది: శైలజానాథ్

Chandrababu Naidus Proposals Rejected by Central Government Says Shailajanath
షార్ట్స్‌లో చూడండి
కేంద్ర బడ్జెట్ లో ఏపీకి తీరని అన్యాయం జరిగినా ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు మెదపడం లేదని మాజీ మంత్రి, వైసీపీ నేత శైలజానాథ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు కీలక నేతగా ఉన్నప్పటికీ... ఆయన ప్రతిపాదనలను కేంద్రం బుట్టదాఖలు చేసిందని చెప్పారు. కేంద్ర నిధులు రాబట్టడంలో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమయిందని అన్నారు. 

రాష్ట్ర ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలే ముఖ్యమని చంద్రబాబు భావిస్తున్నారా? అని శైలజానాథ్ ప్రశ్నించారు. వైసీపీ నేతలపై దాడి చేసే బదులు... రాష్ట్రానికి మేలు జరిగే పనులు చేస్తే బాగుంటుందని అన్నారు. వైసీపీ నేతలపై దాడులు చేయించి, అందరినీ భయపెట్టాలనుకుంటున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమయిందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Chandrababu Naidu
YS Jagan
Shailajanath
Andhra Pradesh
Central Budget
TDP
YSRCP
AP Politics
Central Government Funds
Andhra Pradesh Elections

More Telugu News