N Ramachander Rao: ఆ నిధుల కోసమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు

N Ramachander Rao Slams Telangana Municipal Elections Funding
  • కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఎన్నో మోసపూరిత వాగ్దానాలు చేసిందన్న రామచందర్ రావు
  • అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా హామీలు అమలు చేయలేదని విమర్శ
  • రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలని నిలదీత
కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల కోసమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఎన్నో మోసపూరిత వాగ్దానాలు చేసిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటినప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై మోసపూరిత వాగ్దానాల పేరుతో ఛార్జ్‌షీట్ విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ఓట్లు పొందిందని, కానీ ప్రజలకు ఇప్పటి వరకు చేసిందేమీ లేదని అన్నారు. ఈ రెండేళ్ల కాలంలో ప్రజలకు, రాష్ట్రానికి ఏం చేసిందో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు.

ఉద్యోగులకు సకాలంలో వేతనాలు ఇవ్వడం లేదని, విద్య, వైద్యాన్ని నిర్లక్ష్యం చేశారని, నిరుద్యోగులకు ఇస్తామన్న రూ.4 వేల నిరుద్యోగ భృతి జాడ లేదని మండిపడ్డారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్స్ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి వచ్చే పథకాలు నేరుగా లబ్ధిదారులకే అందుతున్నాయని అన్నారు.
N Ramachander Rao
Telangana BJP
Municipal Elections
Central Government Funds
Congress Promises

More Telugu News