Bhuma Karunakar Reddy: చంద్రబాబు ఆత్మరక్షణలో పడ్డారు: భూమన కరుణాకర్ రెడ్డి
- తిరుమల లడ్డూలో కల్తీ లేదని సీబీఐ చెప్పిందన్న భూమన
- వైసీపీ హయాంలో బోలేబాబాను డిస్ క్వాలిఫై చేశామని వెల్లడి
- అంబటి ఇంటి మీదకు 3 వేల మంది పోలీసులను పంపించారని మండిపాటు
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి విషయంలో సీబీఐ నివేదిక వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆత్మరక్షణలో పడ్డారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. దీని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే వైసీపీ నేతలపై దాడులు చేయిస్తున్నారని విమర్శించారు.
నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డు ఇచ్చిన నివేదిక ప్రకారమే మాట్లాడానని చంద్రబాబు అంటున్నారని భూమన ఎద్దేవా చేశారు. టీటీడీకి ఈ బోర్డును పరిచయం చేసిందే జగన్ అని చెప్పారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసే అవకాశమే లేదని సీబీఐ తెలిపిందని అన్నారు. చంద్రబాబు హయాంలోనే బోలేబాబా డెయిరీ నుంచి టీటీడీ నెయ్యి కొనుగోలు చేసిందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక బోలేబాబాను డిస్ క్వాలిఫై చేశామని అన్నారు.
తాను చేసిన వ్యాఖ్యలకు అంబటి రాంబాబు క్షమాపణ చెప్పినప్పటికీ దాడులు చేశారని భూమన మండిపడ్డారు. అంబటి ఇంటి మీదకు 3 వేల మంది రౌడీలను పంపించారని అన్నారు. జోగి రమేశ్ ఇంటిపై కూడా ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని విమర్శించారు. పక్కా ప్రణాళిక ప్రకారమే అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లపై దాడులు జరిగాయని అన్నారు.