నలుగురు మయన్మార్ మాఫియా సభ్యులను ఉరితీసిన చైనా
- మయన్మార్ కేంద్రంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో శిక్ష అమలు
- ఆరుగురు చైనీయుల మరణానికి కారణమైనట్లు తేలడంతో గత ఏడాది ఉరిశిక్ష విధించిన కోర్టు
- శిక్షను అమలు చేసినట్లు స్థానిక మీడియా వెల్లడి
ఆన్‌లైన్ మోసాలతో పాటు వివిధ కేసులు ఎదుర్కొంటున్న ఈ గ్యాంగులపై చైనా కొంతకాలంగా తీవ్ర చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మయన్మార్‌కు చెందిన నేర ముఠాకు చెందిన సభ్యులకు మరణశిక్షను అమలు చేసినట్లు ఇటీవల స్థానిక మీడియా పేర్కొంది.
వేల కోట్ల రూపాయల కుంభకోణాలు, జూద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఈ మాఫియా, తమ వద్ద పనిచేస్తూ తప్పించుకునేందుకు ప్రయత్నించిన 14 మంది చైనీయుల ప్రాణాలను తీసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈక్రమంలో ముఠాలోని నలుగురికి శిక్షను అమలు చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ శిక్షను ఎప్పుడు అమలు చేశారనేది తెలియరాలేదు.