అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డి
- నిన్న రాత్రి 2.50 గంటలకు హైదరాబాద్ చేరుకున్న రేవంత్
- ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్, ఇతర నేతలు
- అమెరికాలో లీడర్ షిప్ కోర్సు పూర్తి చేసిన రేవంత్
స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో రేవంత్ పాల్గొన్న సంగతి తెలిసిందే. అనంతరం అక్కడి నుంచి అమెరికాకు వెళ్లారు. హార్వర్డ్ యూనివర్సిటీలోని కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ లో ఆయన లీడర్ షిప్ కోర్సు పూర్తి చేశారు. జనవరి 25 నుంచి 30 వరకు జరిగిన లీడర్ షిప్ ఫర్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ పేరిట నిర్వహించిన తరగతులకు ఆయన హాజరయ్యారు. 20 దేశాల నుంచి వచ్చిన 60 మంది విద్యార్థులతో కలిసి ఆయన ఈ కోర్సును పూర్తి చేశారు. అమెరికాలో కోర్సును పూర్తి చేసుకున్న తర్వాత ఆయన హైదరాబాద్ కు తిరిగి వచ్చారు.