Nirmala Sitharaman: 800 పదాలతోనే బడ్జెట్ ప్రసంగం: చరిత్రలో షార్టెస్ట్ స్పీచ్ ఎవరిదో తెలుసా?
- హీరూభాయ్ ముల్జీభాయ్ పటేల్ పేరిట అరుదైన రికార్డు
- అతి సుదీర్ఘ ప్రసంగం చేసిన మంత్రిగా నిర్మలా సీతారామన్
- నేటితో చిదంబరం రికార్డును సమం చేయనున్న నిర్మలమ్మ
- ఆదివారం బడ్జెట్.. దేశ చరిత్రలో ఇదే తొలిసారి
దేశవ్యాప్తంగా రైతులు, మహిళలు, మధ్యతరగతి ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్న 2026-27 ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్ మరికాసేపట్లో పార్లమెంట్ ముందుకు రానుంది. ఈ సందర్భంగా గత బడ్జెట్ రికార్డులు మరోసారి చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా అతి తక్కువ పదాలతో ముగిసిన బడ్జెట్ ప్రసంగం గురించి వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.
స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో బడ్జెట్ ప్రసంగం ముగించిన రికార్డు మాజీ ఆర్థిక మంత్రి హీరూభాయ్ ముల్జీభాయ్ పటేల్ పేరిట ఉంది. 1977లో ఆయన ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ప్రసంగంలో కేవలం 800 పదాలు మాత్రమే ఉన్నాయి. ఇక దీనికి భిన్నంగా అతి సుదీర్ఘ ప్రసంగం చేసిన ఘనత ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు దక్కుతుంది. ఫిబ్రవరి 1, 2020న ఆమె ఏకంగా 2 గంటల 40 నిమిషాల పాటు ప్రసంగించి సరికొత్త రికార్డు సృష్టించారు.
భారతదేశంలో అత్యధికంగా 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ పేరిట ఉండగా, పి. చిదంబరం 9 సార్లు, ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు బడ్జెట్‌ను సమర్పించారు. నేడు తన 9వ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ద్వారా నిర్మలా సీతారామన్, చిదంబరం రికార్డును సమం చేయబోతున్నారు. మరో అడుగు ముందుకేస్తే మొరార్జీ దేశాయ్ రికార్డును కూడా ఆమె అధిగమించే అవకాశం ఉంది.
నేడు ఆదివారం అయినప్పటికీ, బడ్జెట్ ప్రకియ యథావిధిగా సాగనుంది. ఉదయం 8:30 గంటలకు ఆర్థిక మంత్రి నార్త్ బ్లాక్‌కు చేరుకుని బడ్జెట్ పత్రాలకు తుది ఆమోదం తెలిపారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి బడ్జెట్ కాపీని అందజేశారు. ఉదయం 10:15 గంటలకు కేంద్ర క్యాబినెట్ భేటీ అయి బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేస్తుంది. సరిగ్గా ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కానుంది. మోదీ ప్రభుత్వం తన మూడో విడత పాలనలో ప్రవేశపెడుతున్న రెండో బడ్జెట్ కావడంతో, సామాన్యుడిపై వరాల జల్లు కురుస్తుందని అందరూ ఆశిస్తున్నారు. గతేడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ పరిమాణం కంటే ఈసారి బడ్జెట్ దాదాపు 7.9 శాతం ఎక్కువగా ఉంటుందని, సుమారు రూ. 54.1 లక్షల కోట్ల రూపాయల కేటాయింపులు ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.