గంభీర్ నిర్ణయాలపై బ్రియాన్ లారా సంచలన వ్యాఖ్యలు
- గంభీర్ నిర్ణయాలు భారత క్రికెట్ కు ప్రమాదకరమన్న లారా
- గంభీర్ హయాంలో టెస్టు, వన్డే ఫార్మాట్లో ప్రదర్శన పడిపోయిందని వ్యాఖ్య
- భారత క్రికెట్ ను కాపాడాలంటే గంభీర్ ను తప్పించాలని సూచన
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలపై పలువురు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా కూడా విమర్శలు గుప్పించాడు. గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలు భారత క్రికెట్ కు ప్రమాదకరమైనవని అన్నాడు. అతడి నిర్ణయాలు సరికాదని, అవి భారత క్రికెట్ కు నష్టం చేస్తున్నాయని చెప్పాడు.
హెడ్ కోచ్ గా గంభీర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత టెస్టు, వన్డే ఫార్మాట్లో టీమిండియా ప్రదర్శన పడిపోయిందని లారా విమర్శించాడు. టీ20 క్రికెట్ లో మాత్రమే ఇండియా బాగా ఆడుతోందని... టీ20ల్లో విజయాలు కూడా జట్టు సమష్టి కృషి కంటే వ్యక్తిగత ప్రతిభ వల్లే సాధ్యమవుతున్నాయని అన్నాడు. ఇప్పుడు జరగబోయే టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా జట్టుగా విఫలమైతే... కీలకమైన మ్యాచ్ లలో ఓటమి చవిచూడాల్సి వస్తుందని చెప్పాడు. టీ20 వరల్డ్ కప్ లో భారత్స్ అసలైన సమస్యలు బయటపడతాయని అన్నాడు.
ఒకప్పుడు ఇండియాను ఓడించడానికి ప్రత్యర్థి జట్లు వంద రకాల వ్యూహాలతో వచ్చేవని... ఇప్పుడు ఏ జట్టు వచ్చినా వైట్ వాష్ చేస్తోందని లారా సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్ ను కాపాడాలంటే గంభీర్ ను తప్పించాలని... ఆలస్యం చేస్తూ మరింత నష్టం జరుగుతుందని అన్నాడు.