ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉగాదికి జాబ్ క్యాలెండర్!
- ఉగాది నాటికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు
- వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల వివరాల సేకరణపై దృష్టి
- ఆర్థిక భారాన్ని అంచనా వేసిన తర్వాతే తుది ప్రకటన
ఏపీలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ప్రభుత్వం తీపికబురు అందించేందుకు సిద్ధమవుతోంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్‌ను ఉగాది నాటికి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుని కసరత్తు ముమ్మరం చేసింది. దీని కోసం వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
ప్రతి ఏటా ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను గుర్తించి, వాటి భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం అన్ని శాఖల నుంచి ఖాళీల జాబితాను తెప్పించుకుంటోంది. అయితే, కొత్త ఉద్యోగాల భర్తీ వల్ల ప్రభుత్వ ఖజానాపై పడే ఆర్థిక భారాన్ని కూడా జాగ్రత్తగా అంచనా వేస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యాకే జాబ్ క్యాలెండర్‌పై తుది ప్రకటన చేయనున్నారు.
ఇటీవల 16 వేల టీచర్.. 6 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ
గతంలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే ప్రభుత్వం 16,347 టీచర్ పోస్టులతో పాటు 6 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసింది. ఇప్పుడు కొత్త జాబ్ క్యాలెండర్‌ను పకడ్బందీగా రూపొందించి, వీలైనంత త్వరగా నియామక ప్రక్రియ చేపట్టాలని యోచిస్తోంది. గతేడాది జాబ్ క్యాలెండర్ వస్తుందని భావించినా అది కార్యరూపం దాల్చలేదు. అయితే ఈసారి మాత్రం ఉగాది నాటికి నిరుద్యోగుల నిరీక్షణకు తెరదించుతూ ప్రభుత్వం ఓ స్పష్టమైన ప్రకటన చేస్తుందని సమాచారం. దీనిపై త్వరలోనే పూర్తిస్థాయి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.