Kurnool fire accident: కర్నూలు ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో భారీ అగ్ని ప్రమాదం .. ఒకరికి తీవ్ర గాయాలు

Kurnool fire accident at Industrial Estate one injured
కర్నూలులోని కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో నిన్న భారీ అగ్నిప్రమాదం జరిగింది. కోటయ్య సిల్వర్ సామాగ్రి తయారు చేసే ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు ఆయిల్ ట్యాంక్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఫ్యాక్టరీలోని పలు వస్తువులతో పాటు ఓ వాహనం మంటల్లో దగ్ధమైంది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. 
Kurnool fire accident
Kurnool
Industrial Estate
Fire accident
Kallur
Kotayya silver factory
Andhra Pradesh
Fire in factory
Oil tank explosion

More Telugu News