రేపు సతీసమేతంగా రిపబ్లిక్ డే వేడుకలకు హాజరుకానున్న పవన్ కల్యాణ్

  • అమరావతిలో రేపు జరిగే గణతంత్ర వేడుకలకు పవన్ కల్యాణ్ హాజరు
  • అర్ధాంగి అన్నా కొణిదెలతో కలిసి పాల్గొననున్న డిప్యూటీ సీఎం
  • మహారాష్ట్ర పర్యటన ముగించుకుని గన్నవరం చేరుకున్న పవన్
  • నాందేడ్‌లో గురు తేజ్ బహదూర్ షాహిది సమాగంలో పాల్గొన్న దంపతులు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆయన అర్ధాంగి అన్నా కొణిదెల రేపు (జనవరి 26న) రాజధాని అమరావతిలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే అధికారిక కార్యక్రమంలో వారు పాల్గొంటారు.

ఈ వేడుకల కోసం పవన్ కల్యాణ్ దంపతులు ఈ రోజు సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అంతకుముందు వారు మహారాష్ట్రలోని నాందేడ్‌లో పర్యటించారు. అక్కడ నిర్వహించిన గురు తేజ్ బహదూర్ షాహిది సమాగమంలో పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల పాల్గొన్నారు. ఆ కార్యక్రమాన్ని ముగించుకుని వారు ప్రత్యేక విమానంలో నేరుగా గన్నవరం విమానాశ్రయానికి విచ్చేశారు. అక్కడి నుంచి అమరావతికి బయలుదేరి వెళ్లారు.


More Telugu News