హైదరాబాద్ లో పోలీసులపై దాడి

  • చైతన్యపురి పీఎస్ పరిధిలో ఘటన
  • తన కారు అద్దం పగలగొట్టారంటూ పోలీసులకు కిరీటి అనే వ్యక్తి ఫిర్యాదు
  • అక్కడకు వెళ్లిన పోలీసులపై నిందితుడి దాడి
హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి పోలీసులపైనే దాడికి పాల్పడ్డాడు. నిన్న రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... తన కారు అద్దం పగలగొట్టారంటూ కిరీటి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఘటనా స్థలికి హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ వెళ్లారు. కారు అద్దం పగలగొట్టిన నిందితుడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. 

ఈ క్రమంలో, పోలీసులపై కూడా నిందితుడు దాడికి పాల్పడ్డాడు. తన బట్టలు విప్పేసి, పోలీసులపై దాడి చేస్తూ హంగామా సృష్టించాడు. స్థానికులు అడ్డుకోబోయినప్పుడు వారిని కూడా బెదిరించాడు... పారిపోయే ప్రయత్నం చేశాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


More Telugu News