అల్లుడు కేఎల్ రాహుల్ సెంచరీ చేయడంపై సునీల్ శెట్టి స్పందన

  • కివీస్‌పై సెంచరీతో మెరిసిన కేఎల్ రాహుల్
  • అల్లుడిపై ప్రశంసలు కురిపించిన సునీల్ శెట్టి
  • సెంచరీ కన్నా రాహుల్ నిగ్రహమే గొప్పదన్న నటుడు
టీమిండియా స్టార్ క్రికెటర్, తన అల్లుడు కేఎల్ రాహుల్‌పై బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి ప్రశంసల వర్షం కురిపించారు. న్యూజిలాండ్‌తో జనవరి 14న జరిగిన వన్డే మ్యాచ్‌లో రాహుల్ సెంచరీ సాధించడంపై ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రాహుల్ సెంచరీ చేసిన వీడియో క్లిప్‌ను పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

"పొజిషన్ వేరైనా.. ప్రశాంతత, వ్యక్తిత్వం ఒక్కటే. స్కోర్‌బోర్డు ఆ సెంచరీని గుర్తుంచుకుంటుంది. కానీ దాని వెనుక ఉన్న నిగ్రహాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది బిడ్డా" అంటూ సునీల్ శెట్టి తన పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా, సునీల్ శెట్టి కుమార్తె, నటి అతియా శెట్టిని కేఎల్ రాహుల్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2023 జనవరి 23న ఖండాలాలోని సునీల్ శెట్టి ఫామ్‌హౌస్‌లో వీరి వివాహం జరిగింది. పెళ్లయిన రెండేళ్లకు, అంటే 2025 మార్చి 24న ఈ జంటకు కుమార్తె జన్మించింది. తమ గారాలపట్టికి 'ఇవారా' అని పేరు పెట్టినట్లు కొన్నాళ్ల క్రితం వెల్లడించారు. 'ఇవారా' అంటే 'దేవుడి బహుమతి' అని అర్థం. నూతన సంవత్సరం సందర్భంగా తమ కుమార్తెతో కలిసి బీచ్‌లో ఉన్న ఫొటోను పంచుకుని అభిమానులను ఆనందపరిచారు.




More Telugu News