కెనడాలో భారత సంతతి వ్యాపారవేత్త హత్య.. బుల్లెట్ గాయాలతో మృతి
- పంజాబ్‌కు చెందిన వ్యాపారవేత్త బిందర్ గర్చా హత్య
- సర్రే నగరంలోని తన ఇంటికి కొంత దూరంలో గాయాలతో పడిపోయిన వ్యాపారవేత్త
- కొన్నేళ్లుగా కెనడాలో నివసిస్తున్న బిందర్ గర్చా
కెనడాలోని సర్రే నగరంలో భారత సంతతికి చెందిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. మంగళవారం మధ్యాహ్నం పంజాబ్‌కు చెందిన వ్యాపారవేత్త బిందర్ గర్చా తన నివాసానికి సమీపంలో తీవ్ర గాయాలతో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆయన బుల్లెట్ గాయాల కారణంగా మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.
బిందర్ గర్చా గత కొన్నేళ్లుగా కెనడాలో నివసిస్తున్నారని, స్టూడియో-12 పేరుతో ఫొటో స్టూడియోను నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాల్పులు జరిపిన అనంతరం దుండగులు ఉపయోగించినట్లు భావిస్తున్న కాలిపోయిన వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.