పవన్ కల్యాణ్ తో నిర్మాత విశ్వప్రసాద్ భేటీ.. కొత్త ప్రాజెక్టులపై ఊపందుకున్న చర్చలు!
- భోగి పండుగ నాడు పవన్‌తో నిర్మాత విశ్వప్రసాద్ భేటీ
- కొత్త ప్రాజెక్టులపై చర్చలు జరిపినట్టు సమాచారం
- పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సోషల్ మీడియాలో వెల్లడి
- గతంలోనే పలు చిత్రాలకు ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలు
- త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన సినిమాల విషయంలో వేగం పెంచినట్టు కనిపిస్తోంది. భోగి పండుగను పురస్కరించుకుని, ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్‌తో ఆయన సమావేశమయ్యారు. రాబోయే ప్రాజెక్టులపై వీరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ సొంత నిర్మాణ సంస్థ 'పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్' తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది.
గతేడాది డిసెంబర్‌లోనే పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మధ్య బహుళ చిత్రాల భాగస్వామ్యం కోసం తుది దశ చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. దీని ప్రకారం, పవన్ కథానాయకుడిగా రెండు భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కనున్నాయని ప్రచారం జరిగింది. తాజా భేటీతో ఈ చర్చలు మరింత ముందుకు వెళ్లినట్లు స్పష్టమవుతోంది.