రైల్వే మంత్రికి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు లేఖ

  • జూన్ నాటికి పూర్తిగా అందుబాటులోకి రానున్న భోగాపురం విమానాశ్రయం
  • విశాఖ - విజయవాడ సెక్టార్ లో రైళ్లకు డిమాండ్ పెరగనుందన్న విష్ణు
  • మరిన్ని వందే భారత్ సర్వీసులు అవసరమంటూ లేఖ

భోగాపురం ఎయిర్ పోర్టు జూన్ నాటికి పూర్తిగా అందుబాటులోకి వస్తోంది. ఇప్పటికే వాలిడేషన్ ఫ్లైట్ సక్సెస్‌ఫుల్‌గా ల్యాండ్ అయ్యింది. ఇక విశాఖపట్నం విమానాశ్రయం నుంచి అన్ని సివిల్ ప్యాసెంజర్, కార్గో సర్వీసులు భోగాపురానికి మారనున్నాయి. 


ఈ నేపథ్యంలో, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఈ మార్పును దృష్టిలో ఉంచుకుని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు లేఖ రాశారు. విశాఖ నుంచి విజయవాడ, హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు, చెన్నై వెళ్లేందుకు మరిన్ని వందేభారత్ సర్వీసులు అవసరమని, విశాఖ-విజయవాడ సెక్టార్‌లో రైలు డిమాండ్ పెరగనుందని తన లేఖలో పేర్కొన్నారు.



More Telugu News