'మన శంకర వరప్రసాద్' రెండు రోజుల కలెక్షన్లపై అనిల్ రావిపూడి స్పందన

  • రెండు రోజుల్లో రూ. 120 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన మెగాస్టార్ సినిమా
  • అసలైన సంక్రాంతి ఇప్పుడే మొదలవుతుందని అనిల్ వ్యాఖ్య
  • రూ. 500 కోట్ల వరకు కలెక్షన్స్ రావచ్చని నిర్మాత సాహు ధీమా

మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా సంక్రాంతి కానుకగా విడులయింది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అందరూ ఊహించినట్టుగానే భారీ హిట్ దిశగా దూసుకెళుతోంది. జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజే రూ. 84 కోట్లు వసూలు చేసి సత్తా చాటింది. రెండో రోజు కూడా అదే దూకుడును కొనసాగించింది. రెండు రోజుల్లో, ప్రపంచవ్యాప్తంగా రూ. 120 కోట్ల (గ్రాస్) కలెక్షన్స్ సాధించింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.


ఈ సందర్భంగా సినిమా కలెక్షన్లపై అనిల్ రావిపూడి సంతోషాన్ని వ్యక్తం చేశారు. “అసలైన సంక్రాంతి ఇప్పుడే మొదలవుతోంది. అందరూ థియేటర్లకు వచ్చి ఈ సినిమాను ఆస్వాదించాలి. నాకు ఇంతకంటే గొప్ప సంక్రాంతి గిఫ్ట్ మరొకటి ఉండదు” అని అన్నారు.

మరోవైపు, బుక్‌మైషోలో గంటకు 24 వేల టికెట్లు అమ్ముడవుతున్నాయని చిత్ర యూనిట్  తెలిపింది. సక్సెస్ మీట్‌లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ... ఛాలెంజ్‌గా తీసుకుని స్క్రిప్ట్‌ను 25 రోజుల్లో పూర్తి చేశామని తెలిపారు. నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ... ఈ సినిమాకు రూ. 400 నుంచి 500 కోట్ల మధ్య కలెక్షన్స్ రావచ్చని ధీమా వ్యక్తం చేశారు.



More Telugu News