సంక్రాంతి వేడుకలు.. ఏపీలో కోడి పందాల జోరు.. వీడియో ఇదిగో!

  • పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపీ డిప్యూటీ స్పీకర్ సహా పలు నేతల సందడి
  • పందెం రాయుళ్లు, ప్రేక్షకులతో పలు జిల్లాల్లో కోలాహలం
  • కోడి పందాలు వీక్షించేందుకు తెలంగాణ నుంచి వచ్చిన జనం
ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి వేడుకల్లో కోడిపందాలదే ప్రధాన సందడని చెప్పడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పలుచోట్ల ఏటా సంక్రాంతి పండుగకు కోడిపందాలు నిర్వహిస్తుంటారు. ఈ పందాలను చూడడానికి తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల నుంచి జనం వస్తుంటారని స్థానికులు చెబుతున్నారు.

ఈసారి పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించిన కోడి పందాలలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావులతో పాటు హైదరాబాద్‌ మాజీ మేయర్‌ తీగల కృష్ణారెడ్డి పాల్గొని సందడి చేశారు. జిల్లాలోని కాళ్ల మండలం పెదఅమిరంలో జరిగిన ఈ పోటీలలో పాల్గొన్న నేతలు.. పందెం కోళ్లతో ఫొటోలకు ఫోజులిచ్చారు.

తూర్పు గోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, పోలవరం, కృష్ణా జిల్లాలో కోడి పందాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. బరుల వద్ద పందెం రాయుళ్లు, ప్రేక్షకులతో కోలాహలం నెలకొంది.



More Telugu News