హరిజన్, గిరిజన్ పదాలు వాడొద్దు.. హర్యానా సర్కారు కీలక నిర్ణయం
- ప్రభుత్వ రికార్డులు, అధికారిక ఉత్తర్వుల్లో బ్యాన్ అమలు
- భారత రాజ్యాంగంలో ఎక్కడా ఈ పదాల ప్రస్తావన లేదని స్పష్టీకరణ
- షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ అనే పదాలే వాడాలని సూచన
హర్యానాలో కుల వివక్షను రూపుమాపే దిశగా నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ రికార్డుల్లో, అధికారిక ఉత్తర్వుల్లో ‘హరిజన్, గిరిజన్’ పదాలు ఉపయోగించ వద్దని ఆదేశాలు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ అనుబంధ సంస్థలతో పాటు విద్యాసంస్థలకు ఈమేరకు సూచనలు చేసింది. హరిజన్, గిరిజన్ పదాల స్థానంలో రాజ్యాంగంలో పేర్కొన్న షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ పదాలనే వాడాలని పేర్కొంది.
ఈమేరకు హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం ఒక లేఖ విడుదల చేసింది. భారత రాజ్యాంగం ఎస్సీ, ఎస్టీలను సూచించడానికి ఈ వ్యక్తీకరణలను ఉపయోగించదని లేఖలో పునరుద్ఘాటించారు. అధికారిక వ్యవహారాలలో ఈ వ్యక్తీకరణలను నిలిపివేయాలని స్పష్టంగా ఆదేశించే భారత ప్రభుత్వ సూచనలను రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించింది. అప్పట్లో మహాత్మా గాంధీ ఆత్మీయంగా పిలిచిన హరిజన్ అనే పదాన్ని బి.ఆర్. అంబేద్కర్ అప్పట్లోనే వ్యతిరేకించగా.. ఇప్పుడు హర్యానా ప్రభుత్వం ఆ వాదనకే పెద్దపీట వేసింది.
భారత రాజ్యాంగంలో ఎక్కడా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు సంబంధించి 'హరిజన్' లేదా 'గిరిజన్' అనే పదాల ప్రస్తావన లేదని ప్రభుత్వం ఈ సందర్భంగా గుర్తు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు, బోర్డులు, కార్పొరేషన్లు, యూనివర్సిటీ రిజిస్ట్రార్లు, డివిజనల్ కమిషనర్లకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది.