కేంద్ర మంత్రి నివాసంలో పొంగల్ వండిన ప్రధాని నరేంద్ర మోదీ

  • కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ వేడుకలు
  • ప్రపంచవ్యాప్తంగా తమిళులకు శుభాకాంక్షలు తెలిపిన మోదీ
  • తమిళనాడు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రశంసించిన మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పొంగల్ వంటకం తయారు చేశారు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తొలుత పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పొంగల్ వండి, గోవులకు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. పొంగల్ పండుగ సందర్భంగా తమిళనాడు ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులకు మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ రాష్ట్ర రైతులను, తమిళనాడు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రశంసించారు. పొంగల్ పండుగ తమిళుల గొప్ప సంప్రదాయానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. "ప్రియమైన భారతీయులారా, వణక్కం. పొంగల్ సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను" అని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు.


More Telugu News