బార్డర్ లో పాక్ డ్రోన్ల కలకలం.. కాల్పులు జరిపిన సైన్యం
- రాజౌరీ సమీపంలో ఎల్వోసీ వద్ద చక్కర్లు కొట్టిన పాక్ డ్రోన్లు
- 48 గంటల్లోనే రెండుసార్లు మన సరిహద్దుల్లోకి రాక..
- మంగళవారం రాత్రి ఘటన.. బార్డర్ వెంబడి తనిఖీ చేపట్టిన సోల్జర్లు
పాకిస్థాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారత సరిహద్దుల్లోకి డ్రోన్లను పంపిస్తోంది. మంగళవారం జమ్మూకశ్మీర్ లోని రాజౌరీ జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) సమీపంలో డ్రోన్లను గుర్తించినట్లు సైన్యం పేర్కొంది. బార్డర్ దాటి వచ్చిన పాక్ డ్రోన్లపై కాల్పులు జరిపినట్లు తెలిపింది. అంతలోనే అవి మాయమయ్యాయని ఓ ప్రకటనలో తెలిపింది. గడిచిన 48 గంటల్లోనే పాక్ డ్రోన్లు మన సరిహద్దుల్లోకి రావడం ఇది రెండోసారి అని సైనిక అధికారులు తెలిపారు. రాత్రి 7:30 గంటల ప్రాంతంలో రాజౌరీ జిల్లాలోని దుంగా గాలా ప్రాంతంలో పాక్ డ్రోన్లను గుర్తించినట్లు చెప్పారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి వచ్చిన ఈ డ్రోన్లపై కాల్పులు జరపగా.. వెంటనే వెనక్కి వెళ్లిపోయాయని వివరించారు. కాగా, ఈ డ్రోన్ల ద్వారా మాదకద్రవ్యాల రవాణా కానీ అక్రమ ఆయుధాల వ్యాపారం కానీ జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో డ్రోన్ల కదలికలు గుర్తించిన ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో సైన్యం తనిఖీలు చేపట్టింది. డ్రోన్ల ద్వారా ఏవైనా ప్యాకెట్లు జారవిడిచి ఉండే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.