'హక్' సినిమాపై సమంత స్పందన

  • యామీ గౌతమ్, ఇమ్రాన్ హష్మీ కాంబినేషన్లో 'హక్'
  • ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించిన సమంత
  • భావోద్వేగానికి గురయ్యానని వ్యాఖ్య
బాలీవుడ్ నటి యామీ గౌతమ్ (తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే), ఇమ్రాన్ హష్మీ జంటగా నటించిన 'హక్' సినిమా గత ఏడాది విడుదలై, ప్రేక్షకుల మన్ననలు పొందింది. ప్రస్తుతం ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంపై టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత స్పందిస్తూ ప్రశంసలు కురిపించింది. 

'హక్' చిత్రాన్ని చూసి తాను ఎంతో భావోద్వేగానికి గురయ్యానని సమంత చెప్పింది. సినిమా చూడటం అయిపోయిన వెంటనే... దీని గురించి కొన్ని మాటలు రాయాలనిపించిందని తెలిపింది. ఆ సినిమాలోని సన్నివేశాలను చూసి తాను భావోద్వేగానికి గురయ్యానని తెలిపింది. ఆ భావోద్వేగాలను కొంచెం కూడా కోల్పోకూడదని తాను అనుకున్నానని చెప్పింది. లోతైన మానవీయ కోణంలో సినిమాను తెరకెక్కించారని... పక్షపాతం లేకుండా ఎవరినీ తక్కువ చేయకుండా చూపించాని తెలిపింది. యామీ గౌతమ్ ఈ కథకు ప్రాణం పోసిందని ప్రశంసించింది. 


More Telugu News