ప్రయాగ్ రాజ్ లో మాఘ మేళాలో ప్రసాదాల తయారీకి లేటెస్ట్ మెషిన్
- శ్రీ ప్రయాగ్వాల్ క్యాంపులో నిత్యాన్నదానం
- వేలాది మంది భక్తులకు వండి వడ్డిస్తున్న సిబ్బంది
- అన్న ప్రసాదాలను వేగంగా తయారు చేయడానికి భారీ యంత్రాలు
ఈ సందర్భంగా శ్రీ ప్రయాగ్వాల్ సంస్థ వ్యవస్థాపకుడు రోహిత్ మాట్లాడుతూ.. మాఘమేళాకు వచ్చే భక్తులు ఆకలితో అలమటించే పరిస్థితి ఎదురుకాకూడదని అన్నారు. ఇందుకోసం తమ సంస్థ కిచెన్ లో రోజంతా వంటకాలను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. ఆధునిక యంత్రాల సాయంతో రొట్టెలను తయారుచేస్తూ భక్తుల ఆకలిని తీరుస్తున్నట్లు తెలిపారు. పిండి కలపడం నుంచి రొట్టెలను కాల్చడం దాకా మొత్తం ఈ యంత్రమే చేస్తుందని, దీనివల్లే నిత్యం వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నప్రసాదం అందజేస్తున్నామని ఆయన వివరించారు.