ఔరా సైబర్ నేరగాళ్లు..! సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ భార్యకే కుచ్చుటోపీ!

Both States
Advertisement
  • సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ
  • స్టాక్ మార్కెట్ లాభాల ఆశచూపి రూ.2.58 కోట్లు స్వాహా
  • వాట్సాప్ గ్రూపులో చేర్చి, నకిలీ యాప్‌తో మోసగించిన కేటుగాళ్లు
  • మోసం కోసం భర్త బంగారాన్ని కూడా తాకట్టు పెట్టిన బాధితురాలు
  • ఫిర్యాదు స్వీకరించి దర్యాప్తు చేస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు
Advertisement
ఇటీవల ఓ మాజీ ఐపీఎస్ అధికారి భార్య సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారన్న వార్త వెలుగులోకి వచ్చింది. అయితే, ఆ మాజీ ఐపీఎస్ అధికారి సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ అని, బాధితురాలు ఆయన భార్య ఊర్మిళ అని తెలియడంతో ఈ ఘటన అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో ఆమె నుంచి సైబర్ కేటుగాళ్లు ఏకంగా రూ.2.58 కోట్లు కాజేశారు.

వివరాల్లోకి వెళితే.. ఊర్మిళ వాట్సప్‌కు సైబర్ నేరగాళ్ల నుంచి ఓ మెసేజ్ వచ్చింది. తాము సూచించిన విధంగా స్టాక్స్‌లో పెట్టుబడి పెడితే అతి తక్కువ సమయంలోనే అత్యధిక లాభాలు వస్తాయని నమ్మబలికారు. అనంతరం ఆమెను 'స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్చేంజ్ 20' అనే వాట్సాప్ గ్రూపులో చేర్చారు. ఈ గ్రూప్‌లో దినేష్ సింగ్ అనే వ్యక్తి, తాను చెప్పినట్లు చేస్తే 500 శాతం లాభాలు ఖాయమని, కొన్ని స్క్రీన్‌షాట్లు పంపి నమ్మించాడు. అతనికి సహకరిస్తూ, అదే ముఠాకు చెందిన ప్రియసఖి అనే మహిళ తనకు కూడా లాభాలు వచ్చాయంటూ గ్రూప్‌లో పోస్టులు పెట్టింది.

వీరి మాయ మాటలు నమ్మిన ఊర్మిళ, యాపిల్ యాప్ స్టోర్ నుంచి 'MCKIEY CM' అనే నకిలీ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. అనంతరం డిసెంబర్ 24 నుంచి జనవరి 5 మధ్య కాలంలో పలు దఫాలుగా రూ.2.58 కోట్లను నేరగాళ్లు చెప్పిన ఖాతాలకు బదిలీ చేశారు. ఇందుకోసం తన వద్ద ఉన్న బంగారంతో పాటు, భర్త లక్ష్మీనారాయణకు చెందిన బంగారాన్ని కూడా ఆమె తాకట్టు పెట్టడం గమనార్హం. యాప్‌లో లాభాలు కనిపిస్తున్నా, డబ్బును వెనక్కి తీసుకునే (విత్‌డ్రా) ఆప్షన్ లేకపోవడంతో తాను మోసపోయానని ఆమె గ్రహించారు.

వెంటనే బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు, ఊర్మిళ పంపిన డబ్బును సైబర్ నేరగాళ్లు మ్యూల్ ఖాతాలకు మళ్లించినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆ ఖాతాలను గుర్తించి, నిందితులను పట్టుకునే పనిలో ఉన్నామని పోలీసులు తెలిపారు.


Advertisement

సంబంధిత వార్తలు

LakshminarayanaVV LakshminarayanaUrmilaCyber crimeStock market scamOnline fraudCyber fraudVisakhapatnamIPS officerFinancial fraud

More Telugu News

అభి‘షేకింగ్‌’.. టీ20ల్లో చరిత్ర సృష్టించిన టీమిండియా

27 Oct, 15:26

నా బయోపిక్ నిజం కాదు.. అందులో చూపించింది 10 శాతమే.. అసలు కథ వేరు: మేరీ కోమ్

27 Oct, 15:19

అర్ణబ్ ఎఫెక్ట్.. ఉత్తరాంధ్రలో పూర్తిగా మారిన వాతావరణం

27 Oct, 15:08

భారత చమురు కొనుగోళ్లపై అమెరికా ఒత్తిడి? కేంద్రం కీలక ప్రకటన!

27 Oct, 15:03

మాజీ మిస్ స్విట్జర్లాండ్‌పై ట్రంప్ అత్యాచారం.. డెమోక్రాట్ల రిపోర్ట్‌లో సంచలన విషయాలు!

27 Oct, 15:01

అర్ణబ్ తుపాను ప్రభావం: పలు రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

27 Oct, 14:39

డారిల్ మిచెల్ మెరుపులు.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?

27 Oct, 14:30

15 ఏళ్లలో 38 మందిని చంపి తిన్న నరహంతకుడు.. ఉగాండాలో సీరియల్ కిల్లర్ అరెస్ట్!

27 Oct, 14:21

బడులు పెట్టి చేతులు దులుపుకొంటే సరిపోదు.. రేవంత్‌ సర్కార్‌పై ఆకునూరి మురళి తీవ్ర విమర్శలు

27 Oct, 14:10

వెంకటేశ్ సినిమాకు గుడ్ న్యూస్.. టికెట్ ధరల పెంపుకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

27 Oct, 13:46

ఇక ట్రిపుల్ ఇంజన్ సర్కార్.. స్థానిక ఎన్నికలపై చాలా కసరత్తు చేశాం: సీఎం చంద్రబాబు

27 Oct, 13:43

భారత మిడిలార్డర్‌లో ఆరోగ్యకరమైన పోటీ: నితీశ్‌ రెడ్డి

27 Oct, 13:40

'రోబోను పెట్టుకో, మనిషిని తీసెయ్'.. ఏఐతో ఉద్యోగాల తొలగింపుపై బిల్ గేట్స్ వార్నింగ్‌!

27 Oct, 13:31

తెలంగాణ సీనియర్‌ ఐఏఎస్‌ కీలక నిర్ణయం.. వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు

27 Oct, 13:29

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై పిటిషన్లు.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు

27 Oct, 13:24
..More Telugu News