విజయ్ సినిమా నిర్మాత ఆవేదన.. పరిస్థితి చేయి దాటిపోయిందని వ్యాఖ్య

Entertainment
Advertisement
  • సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో నిలిచిపోయిన 'జన నాయగన్' విడుదల
  • విజయ్‌కు సినిమాల నుంచి మంచి వీడ్కోలు దక్కాలని ఆకాంక్షించానన్న నిర్మాత
  • వివాదాల మధ్య సినిమా గందరగోళ పరిస్థితిలో పడిందని వ్యాఖ్య
Advertisement

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన తన చివరి చిత్రం 'జన నాయగన్' (తెలుగులో 'జన నాయకుడు')కు సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో చివరి నిమిషంలో రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో విజయ్‌కు గ్రాండ్‌గా వీడ్కోలు పలకాలని అనుకున్న నిర్మాత వెంకట్ కె. నారాయణ...  మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. దశాబ్దాల పాటు అభిమానులను అలరించిన విజయ్‌కు సినిమాల నుంచి మంచి వీడ్కోలు దక్కాలని తాను ఆకాంక్షించానని, కానీ ప్రస్తుత పరిస్థితి తమ చేయి దాటిపోయిందని ఆయన భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. 


ఈ సినిమా కోసం ఎంతో కష్టపడిన టీమ్‌కు కృతజ్ఞతలు చెబుతూనే... అభిమానులు, పంపిణీదారులకు క్షమాపణలు కూడా చెప్పారు. చట్టపరమైన సమస్యలు, వివాదాల మధ్య ఈ సినిమా గందరగోళ పరిస్థితిలో పడిందని... తమిళనాడులో ఎన్నికల వాతావరణం కూడా ఈ ప్రక్రియను మరింత కష్టతరం చేసిందని ఆయన వివరించారు.


సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో అసలు ఏం జరిగిందంటే... షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ సినిమాను 2025 డిసెంబర్ 18న సెన్సార్ బోర్డుకు సబ్మిట్ చేశారు. డిసెంబర్ 22న యూ/ఏ సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ బోర్డు నుంచి ఈమెయిల్ వచ్చింది. అందులో కొన్ని మార్పులు సూచించారు. ఆ మార్పులు చేసి మళ్లీ సినిమాను సెన్సార్ బోర్డుకు పంపించారు. రిలీజ్‌కు సిద్ధమవుతున్న సమయంలోనే, జనవరి 5న సినిమాపై ఫిర్యాదులు వచ్చాయని చెప్పి, దాన్ని రివైజింగ్ కమిటీకి రిఫర్ చేస్తున్నట్టు సెన్సార్ బోర్డు మరో మెయిల్ చేసింది. రివైజింగ్ కమిటీని సంప్రదించడానికి సమయం మించిపోవడం, అసలు ఎవరు ఫిర్యాదు చేశారో స్పష్టత లేకపోవడంతో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించామని నిర్మాత వివరించారు.


మద్రాస్ హైకోర్టులో ఈ కేసు విచారణ ఇంకా నాటకీయంగా సాగింది. జనవరి 9న సింగిల్ బెంచ్ సినిమాకు యూ/ఏ 16+ సర్టిఫికెట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో విజయ్ అభిమానులు, చిత్ర బృందం ఊపిరి పీల్చుకున్నారు, సంబరాలు కూడా మొదలయ్యాయి. కానీ ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. అదే రోజు సెన్సార్ బోర్డు (సీబీఎఫ్‌సీ) ఆ ఆర్డర్‌ను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. కేసు విచారణకు స్వీకరించిన న్యాయస్థానం సర్టిఫికెట్ జారీపై తాత్కాలిక స్టే విధించింది. తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేసింది. కోర్టు మాట్లాడుతూ, సినిమా మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి సిస్టమ్‌పై అనవసరమైన ఒత్తిడి తీసుకువచ్చారని, ఇందులో ఎలాంటి తొందర అవసరం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో, మేకర్స్ ఇప్పుడు సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని సమాచారం.

Advertisement

సంబంధిత వార్తలు

VijayVijay filmJan NayaganKollywoodVenkat K NarayanaTamil Nadu electionsCensor BoardMadras High Courtmovie releasecontroversy

More Telugu News

అక్రమ మైనింగ్‌పై ఏపీ సర్కార్ ఉక్కుపాదం.. బకాయిల వసూలుకు రెవెన్యూ రికవరీ చట్టం!

07 Nov, 09:05

'బ్లూ డ్రమ్', 'స్నేక్‌బైట్' మర్డర్ దోషులు.. ఇప్పుడు జైలులో దీపావళి పనుల్లో బిజీ

07 Nov, 08:44

లాహోర్ సదస్సు.. భారత్ అనుమతిస్తే సీఎం భగవంత్ మాన్‌కు వీసా ఇస్తాం: పాకిస్థాన్

07 Nov, 08:38

కివీస్‌తో రెండో వన్డే.. టాస్ గెలిచిన భారత్.. ఓవర్ల కుదింపు

07 Nov, 08:20

భారత్‌పై వైఖరి మార్చుకున్న నేపాల్ ప్రధాని.. త్వరలో భారత పర్యటన

07 Nov, 08:13

ట్రంప్ సంచలనం: వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా స్టీఫెన్ మిల్లర్ నియామకం

07 Nov, 08:11

సింహాచలంలో సంప్రదాయ దుస్తులు తప్పనిసరి.. ఈవో కీలక ప్రకటన

07 Nov, 07:47

ట్రంప్‌ హత్యకు కుట్ర?.. వైట్‌హౌస్ వద్ద భారీ ఆయుధాలతో వ్యక్తి అరెస్ట్

07 Nov, 07:42

లార్డ్స్ బాల్కనీలో గంగూలీ ఊపిన చొక్కా.. ఇక ముంబైలో ప్రదర్శనకు

07 Nov, 07:18

నేను అడ్డుకోకుంటే ఇజ్రాయెల్ ఉండేది కాదు: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

07 Nov, 06:59

టెస్ట్ క్రికెట్‌కు మహమ్మద్ షమీ గుడ్‌బై.. 13 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు

07 Nov, 06:44

యెమెన్‌లో ఆగని హింస.. మార్కెట్‌పై దాడిలో భారీగా పౌరుల మృతి

07 Nov, 06:30

‘రామాయణం’లో లక్ష్మణుడి పాత్ర.. లుక్ టెస్ట్ వరకు వెళ్లి ఛాన్స్ మిస్సయ్యా: నటుడు కరణ్ జోత్వానీ

07 Nov, 06:27

22 ఏళ్ల తర్వాత మళ్లీ అదే టైటిల్.. కమల హాసన్ కొత్త చిత్రం ‘సండియార్’

07 Nov, 06:22

మురసు తుపాను: ఏపీకి తక్షణ సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ

07 Nov, 06:17
..More Telugu News