సోమనాథ ఆలయానికి రూ.5 కోట్ల విరాళం ఇచ్చిన ముఖేశ్ అంబానీ
- కుటుంబంతో కలిసి పరమేశ్వరుడిని దర్శించుకున్న రిలయన్స్ ఛైర్మన్
- ప్రత్యేక పూజలు చేసిన ముఖేశ్ అంబానీ కుటుంబం
- ప్రతి సంవత్సరం ఆరంభంలో దర్శించుకుంటున్న ముఖేశ్ కుటుంబం
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ గుజరాత్‌లోని సోమనాథ దేవాలయానికి రూ.5 కోట్ల విరాళం అందజేశారు. ముఖేశ్ అంబానీ శుక్రవారం తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ జ్యోతిర్లింగ స్వరూపుడైన పరమేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముఖేశ్ అంబానీతో పాటు ఆయన భార్య నీతా అంబానీ, కుమారుడు అనంత్ అంబానీ కూడా సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ వారు ఆలయానికి చేరుకున్నారు. అంబానీ కుటుంబం ప్రతి సంవత్సరం ఆరంభంలో సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తోంది. గత సంవత్సరం కూడా వారు ఆ పరమేశ్వరుడిని దర్శించుకున్నారు.