రాజ్‌ఘాట్‌ను సందర్శించిన పుతిన్.. గాంధీజీ సమాధి వద్ద నివాళి
- రాజ్‌ఘాట్‌లోని గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు
- రాష్ట్రపతి భవన్లో ఘన స్వాగతం పలికిన ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము
- రక్షణ, ఇంధన రంగాలపై ప్రధాని మోదీతో కీలక చర్చలు జరపనున్న పుతిన్
అంతకుముందు రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో పుతిన్‌కు సంప్రదాయబద్ధంగా గౌరవ వందనంతో స్వాగతం పలికారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన్ను సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఇరు దేశాల ఉన్నతాధికారులను ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు.
ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, అధ్యక్షుడు పుతిన్ హైదరాబాద్ హౌస్‌లో అధికారిక చర్చలు జరపనున్నారు. ఈ భేటీలో రక్షణ, ఇంధన రంగాల్లో సహకారం, ప్రాంతీయ భద్రత, దీర్ఘకాలిక ఆర్థిక భాగస్వామ్యం వంటి కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ చర్చలు ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.