మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రభాస్ 'స్పిరిట్' ప్రారంభం
- సందీప్ వంగా దర్శకత్వంలో ప్రభాస్ సినిమా
- ముహూర్తం షాట్ కు క్లాప్ కొట్టిన చిరంజీవి
- హాజరైన హీరోయిన్ తృప్తి దిమ్రి, నిర్మాతలు
ఈ సినిమాలో ప్రభాస్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారని చిత్రబృందం తెలిపింది. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రాన్ని టీ-సిరీస్, వంగా పిక్చర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు.
