ప్రభాస్ 'రెబెల్ సాబ్' ప్రోమో ఇదిగో... రేపు ఫుల్ సాంగ్ రిలీజ్
- ప్రభాస్ 'ది రాజా సాబ్' నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల
- 'రెబెల్ సాబ్' పేరుతో రానున్న ఈ పాటకు తమన్ సంగీతం
- రేపు ఆదివారం రాత్రి 8.11 గంటలకు పూర్తి పాట రిలీజ్
- మారుతి దర్శకత్వంలో 2026 జనవరి 9న సినిమా విడుదల
- భారీ తారాగణంతో పాన్ ఇండియా స్థాయిలో చిత్రం నిర్మా
విడుదలైన ఈ ప్రోమోలో ప్రభాస్ ఎంట్రీ, ఆయన స్వాగ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సంగీత దర్శకుడు తమన్ అందించిన బీట్స్ పవర్ఫుల్గా ఉన్నాయి. మారుతి దర్శకత్వంలో ఈ సినిమా పూర్తిస్థాయి మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్నట్టు ఈ ప్రోమో చూస్తే స్పష్టమవుతోంది. "స్వేగ్ & ఎంట్రీ లెవెల్ పాన్ ఇండియా నెం.1" అంటూ మేకర్స్ ఈ ప్రోమోను పంచుకున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న ఈ సాంగ్ ప్రోమో, సినిమాపై అంచనాలను మరింత పెంచింది. 'ది రాజా సాబ్' చిత్రాన్ని 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.