కర్ణాటకలో సీఎం మార్పు లేనట్టేనా.. హింట్ ఇచ్చిన సిద్ధరామయ్య
- ఐదేళ్లూ తానే ముఖ్యమంత్రినని ఇప్పటికే పలుమార్లు వెల్లడి
- ఇటీవల సీఎం మార్పుపై ఊహాగానాలు
- 17వ బడ్జెట్ ప్రవేశపెడతానంటూ సిద్ధరామయ్య వ్యాఖ్య
అయితే, ఈ ప్రచారాన్ని సిద్ధరామయ్య ఖండించారు. ఐదేళ్లూ తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ఆయన పదేపదే చెబుతూ వచ్చారు. తాజాగా రాష్ట్ర బడ్జెట్ కు సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన ప్రకటనతో ఇప్పట్లో సీఎం మార్పు ఉండదని స్పష్టమవుతోంది. అసెంబ్లీలో 16వ బడ్జెట్ ప్రవేశపెట్టానని, త్వరలో 17వ బడ్జెట్ ను కూడా తానే ప్రవేశపెడతానని సీఎం సిద్ధరామయ్య తాజాగా ప్రకటించారు. ఈ ప్రకటనతో సీఎం పదవి నుంచి దిగిపోయే ప్రసక్తేలేదని సిద్ధరామయ్య పరోక్షంగా వెల్లడించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కనీసం వచ్చే ఏడాది మార్చి వరకైనా సీఎం పదవిలో తానే కొనసాగుతానని సిద్ధరామయ్య స్పష్టం చేశారని చెబుతున్నారు.