ఏపీలో నేడు మిశ్రమ వాతావరణం.. కొన్నిచోట్ల వర్షాలు, మరికొన్నిచోట్ల అధిక ఉష్ణోగ్రతలు
- ఏపీలో జూన్ 4న మిశ్రమ వాతావరణం
- అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు
- పోలవరం, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు తదితర జిల్లాల్లో 43 – 45 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు
పోలవరం, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43 – 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని చెప్పింది. ద్రోణి ప్రభావంతో మరోవైపు మన్యం, అల్లూరి, పశ్చిమ గోదావరి, ఏలూరు సహా మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురస్తాయని పేర్కొంది.
ఈ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు బయటకు వెళ్లవద్దని, వర్షాల సమయంలో పిడుగుల నుంచి రక్షణ పొందాలని అధికారులు సూచించారు.