ధర్మవరంలో జనసేనలో చేరిన 100 కుటుంబాలు
- జనసేనలోకి డ్వాక్రా సంఘాల సభ్యులు
- పవన్ కల్యణ్ సిద్ధాంతాలే చేరికకు కారణమన్న సభ్యులు
- పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన చిలకం మధుసూదన్ రెడ్డి
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితులై ధర్మవరం పట్టణంలో పలువురు ఆ పార్టీలో చేరారు. పట్టణంలోని 36వ వార్డు కొత్తపేట, శాంతినగర్‌కు చెందిన డ్వాక్రా సంఘాల సభ్యులు, మహిళలు సహా సుమారు 100 కుటుంబాలు బుధవారం జనసేన తీర్థం పుచ్చుకున్నాయి. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.
జనసేన పార్టీ సీనియర్ నాయకులు కోటిరెడ్డి రాజారెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీపై నమ్మకంతో చేరిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. జనసేన పార్టీ కేవలం ఒక రాజకీయ వేదిక కాదని, ప్రజల ఆశలు, ఆశయాలకు ప్రతీక అని ఆయన అన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు తాను నిరంతరం అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
"కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా, ఏ సమస్య ఎదురైనా నేను ముందుండి పరిష్కరిస్తాను. నేను నిరంతరం మీకు అందుబాటులో ఉంటాను" అని మధుసూదన్ రెడ్డి హామీ ఇచ్చారు. పార్టీలో కొత్తగా చేరిన సభ్యులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, పవన్ కల్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.