ముఖ్యమంత్రి మార్పు.. సిద్ధరామయ్యకు అపాయింట్మెంట్ ఇవ్వని కాంగ్రెస్ అధిష్ఠానం!
- కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై జోరుగా ప్రచారం
- కాంగ్రెస్ పెద్దలతో సమావేశమయ్యేందుకు సమయం కోరిన సిద్ధరామయ్య
- ఆ సమావేశం అవసరం లేదన్న కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం
ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పెద్దలతో సమావేశమయ్యేందుకు ఆయన సమయం కోరగా, ఆ సమావేశం అవసరం లేదని కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనకు స్పష్టం చేసిందని తెలుస్తోంది.
కేంద్ర నాయకత్వం సమయం ఇవ్వడానికి నిరాకరించినప్పటికీ, సిద్ధరామయ్య తన ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు. మరో రెండున్నరేళ్లు తమ పార్టీయే అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్‌కే ప్రజలు ఓటు వేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.