వివేకా కేసులో మరో కీలక మలుపు.. హైదరాబాద్ కోర్టులో సునీతారెడ్డి పిటిషన్

Andhra
Advertisement
  • వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టును ఆశ్రయించిన కుమార్తె సునీత
  • మరింత లోతుగా దర్యాప్తు జరపాలని అభ్యర్థిస్తూ పిటిషన్ దాఖలు
  • సుప్రీంకోర్టు సూచనల మేరకే ట్రయల్ కోర్టులో పిటిషన్
  • అసలు నిందితులు తప్పించుకునే ప్రమాదం ఉందని ఆందోళన
  • సాక్షులను ప్రభావితం చేస్తున్నారని పిటిషన్‌లో ఆరోపణ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు జరపాలని కోరుతూ ఆయన కుమార్తె డాక్టర్ ఎన్. సునీతారెడ్డి బుధవారం హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి దర్యాప్తు కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు ఇటీవల సూచించిన నేపథ్యంలో, ఆమె ఈ పిటిషన్‌ను దాఖలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ కేసులో దర్యాప్తును కేవలం కొందరికే పరిమితం చేస్తే అసలైన సూత్రధారులు తప్పించుకునే ప్రమాదం ఉందని, ఇప్పటికే తండ్రిని కోల్పోయి తీవ్ర వేదనలో ఉన్న తనకు అన్యాయం జరగకూడదని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. సాక్షులను ప్రభావితం చేసేందుకు తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ విషయాన్ని స్వయంగా సీబీఐ, ఏపీ పోలీసులే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారని ఆమె గుర్తుచేశారు.

ఈ కేసులో ఐదో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి, కడప జైలులో అప్రూవర్‌గా మారిన నాలుగో నిందితుడు దస్తగిరితో భేటీ అయి, ఆయన్ను ప్రలోభపెట్టేందుకు, బెదిరించేందుకు ప్రయత్నించారని సునీత ఆరోపించారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆమె కోర్టుకు విన్నవించారు.

అంతేకాకుండా, వివేకా వద్ద పీఏగా పనిచేసిన ఎంవీ కృష్ణారెడ్డి, తొలుత ఫిర్యాదు చేసి.. ఆ తర్వాత తనపైన, తన భర్త రాజశేఖర్ రెడ్డిపైన, అప్పటి సీబీఐ దర్యాప్తు అధికారి రాంసింగ్‌పైన తప్పుడు కేసు పెట్టారని సునీత పేర్కొన్నారు. అయితే ఏపీ పోలీసులే విచారణ జరిపి అది అసత్య కేసని తేల్చి తుది నివేదిక ఇచ్చారని ఆమె తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో, కేసును లోతుగా దర్యాప్తు చేసి సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసేలా సీబీఐని ఆదేశించాలని ఆమె కోర్టును అభ్యర్థించారు.
Advertisement

సంబంధిత వార్తలు

More Telugu News

గుర్నూర్‌ అదుర్స్‌.. అదొక్కటి చేస్తే ఇక అతడికి తిరుగుండదన్న కెప్టెన్‌ గిల్‌!

07 Nov, 17:15

కొడంగల్ టెండర్లలో పొంగులేటి కంపెనీకి లబ్ధి: కేటీఆర్

07 Nov, 17:00

ఆకాశమే హద్దుగా.. 13,629 అడుగుల ఎత్తులో భారత వాయుసేన ప్రపంచ రికార్డు!

07 Nov, 16:56

బొత్స సత్యనారాయణకు బిగ్ షాక్.. ఓటమి బాటలో కుమార్తె

07 Nov, 16:41

30,273 ఓట్ల మెజార్టీ.. ఏపీలోనే టాప్‌.. పరిషత్‌ ఎన్నికల్లో భారీ మెజార్టీలతో గెలిచిన అభ్యర్థులు వీళ్లే..!

07 Nov, 16:26

రాహుల్‌ వెనుక విదేశీ టూల్‌కిట్‌? బీజేపీ చీఫ్‌ నబీన్‌ సంచలన ఆరోపణలు!

07 Nov, 16:12

పల్లె, పట్టణం ఏకమై కూటమికి పట్టం కట్టాయి: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్

07 Nov, 16:00

కివీస్‌ ఆశలపై వర్షం నీళ్లు.. డీఎల్‌ఎస్‌తో భారత్‌కు సిరీస్‌లో రెండో విజయం!

07 Nov, 15:58

ఎమ్మెల్సీపై డెకాయిటీ కేసులా?: చంద్రబాబు సర్కారుపై జగన్ ఫైర్

07 Nov, 15:51

విశాఖ వేదికగా గ్లోబల్ సమ్మిట్.. ప్రపంచ పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం

07 Nov, 15:44

భారత్‌లో ఏ క్యాన్సర్‌ ఎక్కువో తెలుసా? మహిళలు, పురుషుల్లో టాప్‌-3 ఇవే!

07 Nov, 15:42

కివీస్‌పై చెలరేగిన గుర్నూర్ బ్రార్.. జవగళ్ శ్రీనాథ్ తర్వాత అరుదైన ఘనత

07 Nov, 15:28

'ట్రంప్‌ను ఇకపై నమ్మలేం'.. అమెరికా దాడుల భయంతో ప్ర‌జ‌ల‌కు అయోడిన్ మాత్రలు పంచుతున్న‌ ఇరాన్!

07 Nov, 15:10

టెస్లా కీలక నిర్ణయం.. మూడేళ్లకే అంతమవుతున్న మస్క్‌ కల!

07 Nov, 15:09

మేకపాటి సొంతూరిలో టీడీపీ జెండా.. పరిషత్ ఉపఎన్నికల్లో కూటమి హవా

07 Nov, 15:03
..More Telugu News