హిట్ మ్యాన్ చేతుల మీదుగా వన్డే క్యాప్ అందుకున్న నితీశ్ కుమార్ రెడ్డి... ఫొటోలు ఇవిగో!
- ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో అరంగేట్రం చేసిన నితీశ్ రెడ్డి
- టీమిండియా వన్డే జట్టులోకి అడుగుపెట్టిన తెలుగు ఆల్‌రౌండర్
- నితీశ్‌కు వన్డే క్యాప్ అందించిన సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ
- టెస్టులు, టీ20ల తర్వాత ఇప్పుడు వన్డే ఫార్మాట్‌లోనూ చోటు
నేడు పెర్త్ స్టేడియంలో మ్యాచ్ కు ముందు టీమిండియా దిగ్గజ క్రికెటర్ రోహిత్ శర్మ చేతుల మీదుగా నితీశ్ కుమార్ రెడ్డి టీమిండియా వన్డే క్యాప్ అందుకున్నాడు. ఈ సందర్భంగా అతడికి కోచ్ గంభీర్, సహచర ఆటగాళ్లు శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది.

