ఢిల్లీలోని ఎంపీల నివాస సముదాయంలో అగ్నిప్రమాదం

  • బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్‌లో చెలరేగిన మంటలు
  • లోహియా ఆసుపత్రికి ఎదురుగా నివాస సముదాయం
  • మంటలను అదుపులోకి తీసుకువచ్చిన అగ్నిమాపక సిబ్బంది
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎంపీల నివాస సముదాయమైన బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దేశ రాజధానిలోని రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రికి ఎదురుగా ఈ నివాస సముదాయం ఉంది. ఇందులో పలువురు రాజ్యసభ, లోక్‌సభ ఎంపీల నివాసాలు ఉన్నాయి.

బాబా ఖరాగ్ సింగ్ మార్గ్‌లోని బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్‌లో మంటలు చెలరేగినట్లు సమాచారం అందుకున్న అధికారులు 14 ఫైరింజన్లను మోహరించారు. దాదాపు గంట పాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నివాస సముదాయన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2020లో ప్రారంభించారు.


More Telugu News