Andhra Bank Fraud: ఆంధ్రా బ్యాంకును మోసగించిన కేసు... రూ.26.86 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
- బ్యాంక్ మోసం కేసులో సౌభాగ్య ఇస్పాత్ సంస్థపై ఈడీ కొరడా
- హైదరాబాద్ జోనల్ ఆఫీస్ ద్వారా రూ.26.86 కోట్ల ఆస్తుల అటాచ్
- ఆంధ్రా బ్యాంక్ నుంచి నకిలీ పత్రాలతో భారీగా రుణాలు
- నిధుల మళ్లింపు కోసమే తప్పుడు రికార్డుల సృష్టి
- రికవరీ కాని మొత్తానికి సరిపడా ఆస్తులను జప్తు చేసిన అధికారులు
బ్యాంకు రుణాల మోసం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హైదరాబాద్ జోనల్ అధికారులు కీలక చర్యలు చేపట్టారు. సౌభాగ్య ఇస్పాత్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఐఐపీఎల్) కంపెనీకి చెందిన రూ.26.86 కోట్ల విలువైన స్థిరాస్తులను తాత్కాలికంగా అటాచ్ చేస్తున్నట్లు ప్రకటించారు. జప్తు చేసిన ఆస్తుల్లో ప్లాట్లు, ఇళ్లు, ఇతర స్థలాలు ఉన్నట్లు ఈడీ తెలిపింది.
ఆంధ్రా బ్యాంకు (ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)ను మోసగించి, బ్యాంకుకు నష్టం కలిగించారన్న అభియోగంపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ దర్యాప్తు చేపట్టింది. స్టీల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు, విస్తరణ పేరుతో కంపెనీ డైరెక్టర్లు, ఇతర నిందితులు బ్యాంకు నుంచి టర్మ్ లోన్లు, వర్కింగ్ క్యాపిటల్ తీసుకున్నారు. అయితే, అర్హత కంటే ఎక్కువ రుణాలు పొందేందుకు నకిలీ స్టాక్ స్టేట్‌మెంట్లు, తప్పుడు ఆర్థిక నివేదికలు, ఫోర్జరీ పత్రాలను బ్యాంకుకు సమర్పించినట్లు విచారణలో తేలింది.
తీసుకున్న రుణాలను వ్యాపార అవసరాలకు వాడకుండా.. ఇతర మార్గాల్లో దారి మళ్లించినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. సంబంధిత సంస్థల ద్వారా లావాదేవీలు జరిపినట్లు రికార్డులు సృష్టించి, కంపెనీ టర్నోవర్‌ను కృత్రిమంగా పెంచి చూపించారు. ఇలా మోసపూరిత మార్గాల ద్వారా సుమారు రూ.46.52 కోట్ల మేర నేరపూరిత ఆదాయాన్ని ఆర్జించినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో బ్యాంకు ఇప్పటికే రూ.15.52 కోట్లను రికవరీ చేసింది. మిగిలిన మొత్తానికి సంబంధించి.. ప్రస్తుతం మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద రూ.26.86 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.