తెలంగాణలో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
- పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
- ఆదిలాబాద్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు
ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఈ రోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
రేపు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.