స్మితా సబర్వాల్ పై చర్యలు వద్దు.. హైకోర్టు
- జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో తన పేరు చేర్చడంపై స్మిత అభ్యంతరం
- కమిషన్ నివేదికను కొట్టివేయాలంటూ న్యాయస్థానంలో పిటిషన్
- ఈ నివేదిక ఆధారంగా స్మితా సబర్వాల్ పై చర్యలు తీసుకోవద్దన్న కోర్టు
నోటీసుల జారీ, వాంగ్మూలం నమోదు చేసిన విధానాన్ని ఆమె న్యాయస్థానంలో సవాల్ చేశారు. కమిషన్ నివేదికను కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. తనపై తదుపరి చర్యలు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా స్మితా సబర్వాల్ పై చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఇప్పటికే దాఖలైన పిటిషన్లతో కలిపి దీనిని విచారిస్తామని పేర్కొంది.