బీజేపీలో చేరిన సినీ నటుడు వరుణ్ సందేశ్ తల్లి డాక్టర్ రమణి

  • తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు సమక్షంలో చేరిక
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు
  • సమాజ సేవ, హిందుత్వం అంటే తనకు ఇష్టమన్న డాక్టర్ రమణి
ప్రముఖ సినీ నటుడు వరుణ్ సందేశ్ తల్లి డాక్టర్ రమణి బీజేపీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రమణి మాట్లాడుతూ, తమ కుటుంబానికి హిందుత్వం అంటే ఇష్టమని, అందుకే బీజేపీలో చేరినట్లు తెలిపారు.

అలాగే సమాజ సేవ చేయడం అన్నా తమకు ఇష్టమని, బీజేపీలో ఉంటే ప్రజలకు సేవ చేయవచ్చుననే ఆలోచనతో పార్టీలో చేరినట్లు ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తానని ఆమె అన్నారు. తనను బీజేపీలోకి ఆహ్వానించినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.


More Telugu News