ఫాక్స్‌కాన్‌లో మళ్లీ అదే సీన్.. భారత్ నుంచి వందలాది చైనా ఇంజినీర్లు వెనక్కి!
- భారత్ నుంచి మరో 300 మంది చైనా ఇంజినీర్ల వెనక్కి
- ఫాక్స్‌కాన్ అనుబంధ సంస్థ యుజాన్ టెక్నాలజీ నిర్ణయం
- నెలల వ్యవధిలో ఇలా జరగడం ఇది రెండోసారి
- ఐఫోన్ 17 సిరీస్ పనులు సమీపిస్తున్న వేళ కీలక పరిణామం
- భవిష్యత్తులో తైవాన్ నుంచి ఇంజినీర్లను తెచ్చేందుకు కంపెనీ సన్నాహాలు
యాపిల్ ఐఫోన్ల కాంట్రాక్ట్ తయారీదారు ఫాక్స్‌కాన్ అనుబంధ సంస్థ యుజాన్ టెక్నాలజీ భారత్‌లో పనిచేస్తున్న 300 మంది చైనా ఇంజినీర్లను వెనక్కి పిలిపించింది. కొద్ది నెలల వ్యవధిలో ఈ తరహా పరిణామం చోటుచేసుకోవడం ఇది రెండోసారి.
యాపిల్ ఐఫోన్ 17 సిరీస్ తయారీ పనులు సమీపిస్తున్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో జులై 2న కూడా ఫాక్స్‌కాన్ దాదాపు ఇంతే సంఖ్యలో చైనా ఇంజినీర్లను వారి స్వదేశానికి పంపిన విషయం తెలిసిందే. తాజాగా మరో 300 మందిని వెనక్కి పిలవడంతో పాటు, భారత్‌కు కొత్తగా రావాల్సి ఉన్న మరో 60 మంది ఇంజినీర్ల ప్రయాణాన్ని కూడా రద్దు చేసినట్లు 'ఎకనామిక్ టైమ్స్' నివేదించింది. ఈ విషయాన్ని కంపెనీ ఇప్పటికే భారత ప్రభుత్వానికి తెలియజేసినట్లు సమాచారం.
ఒకవైపు భారత్-చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయని వార్తలు వస్తున్న సమయంలో ఫాక్స్‌కాన్ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యంగ్ లియు, భారత్‌లో పెట్టుబడులు, కార్యకలాపాలపై ఒక నివేదిక సమర్పించాలని కోరినట్లు కూడా తెలుస్తోంది.
అయితే, చైనా ఇంజినీర్లను వెనక్కి పంపడం వల్ల భారత్‌లోని స్థానిక కార్యకలాపాలపై తక్షణ ప్రభావం ఏమీ ఉండబోదని కంపెనీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా, చైనాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా తైవాన్ వంటి ఇతర దేశాల నుంచి నిపుణులైన ఇంజినీర్లను భారత్‌కు రప్పించేందుకు స్థానిక యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.