భారత్-పాక్ యుద్ధంపై మరోసారి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- అణుయుద్ధం దాకా వెళితే తానే అడ్డుకున్నానని కామెంట్
- రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ వేళ ట్రంప్ స్పందన
- పలు అంతర్జాతీయ సంక్షోభాలను నివారించానంటూ స్కోత్వర్ష
పహల్గాం ఉగ్ర దాడి తర్వాత భారత్, పాక్ ల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయని వ్యాఖ్యానించారు. ఓ దశలో ఇరు దేశాలు అణ్వాయుధ దాడులకు సిద్ధమయ్యాయని చెప్పారు. దాంతో తాను కల్పించుకోవాల్సి వచ్చిందని, యుద్ధం వెంటనే ఆపకపోతే ఇరు దేశాలతో అమెరికా ఎలాంటి వ్యాపార సంబంధాలు కుదుర్చుకోబోదని హెచ్చరించానని వివరించారు.
ఈ బెదిరింపులతో రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని తెలిపారు. దీంతో పాటు అంతర్జాతీయంగా నెలకొన్న పలు సంక్షోభాలను తానే నివారించానని ట్రంప్ ప్రకటించుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భేటీ వేళ వైట్ హౌస్ వేదికగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.