Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శంషాబాద్ విమానాశ్రయంలో రూ. 13 కోట్ల గంజాయి పట్టివేత

Shamshabad Airport 13 Crore Ganja Seized
Advertisement
  • బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికురాలి వద్ద గంజాయి పట్టివేత
  • హైడ్రోఫోనిక్ గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ అధికారులు
  • మహిళను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలింపు
Advertisement
హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు రూ. 13.3 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికురాలి వద్ద ఈ భారీ మొత్తంలో ఉన్న హైడ్రోఫోనిక్ గంజాయిని గుర్తించి సీజ్ చేశారు.

గంజాయిని అక్రమంగా తరలిస్తున్న మహిళను అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు. గత నెల 30న కూడా బ్యాంకాక్ నుంచి వచ్చిన మరో మహిళ వద్ద రూ. 40 కోట్ల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. శంషాబాద్ విమానాశ్రయంలో తరుచూ గంజాయి పట్టుబడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
Advertisement
Advertisement
Shamshabad Airport
Hyderabad Airport
Ganja Seizure
DRI Hyderabad
Hydroponic Ganja

More Telugu News