అత్యాచారం కేసులో దోషిగా తేలిన ప్రజ్వల్ రేవణ్ణ.. కోర్టులో కంతటడి పెట్టిన మాజీ ఎంపీ

  • రేపు శిక్షను ఖరారు చేయనున్్న ప్రత్యేక న్యాయస్థానం
  • ప్రజ్వల్ అత్యాచారానికి పాల్పడ్డాడని సైబర్ క్రైమ్‌ స్టేషన్‌లో మహిళ ఫిర్యాదు
  • 2 వేల పేజీల ఛార్జీషీట్ దాఖలు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం
అత్యాచారం కేసులో దోషిగా తేలడంతో జేడీఎస్ అధినేత దేవేగౌడ మనవడు, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కోర్టు గదిలోనే కంటతడి పెట్టారు. ఒక అత్యాచారం కేసులో మాజీ ఎంపీని ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చుస్తూ తీర్పు వెలువరించింది. రేపు శిక్షను ఖరారు చేయనుంది.

ప్రజ్వల్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆ దారుణాన్ని రికార్డు చేసి బెదిరించేవాడని ఒక మహిళ గత ఏడాది సైబర్ క్రైమ్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రత్యేక బృందం దర్యాప్తు చేసి 2 వేల పేజీల ఛార్జీషీట్ దాఖలు చేసింది. విచారణలో భాగంగా 123 ఆధారాలను సేకరించింది. ప్రత్యేక న్యాయస్థానంలో 2024 డిసెంబర్ 31న విచారణ ప్రారంభమైంది. ఫోరెన్సిక్ ఆధారాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.


More Telugu News