Anwar Ibrahim: మలేసియా ప్రధాని అన్వర్, నేను ఎప్పటి నుంచో స్నేహితులం: ప్రధాని నరేంద్ర మోదీ
- ఆయన ప్రధాని కాకముందు నుంచే తనకు పరిచయం ఉందన్న మోదీ
- భారత సంతతి కమ్యూనిటీ ఉన్న రెండో అతిపెద్ద దేశం మలేసియా అన్న మోదీ
- తమిళ సంతతికి చెందిన వారు మలేసియాలో దశాబ్దాలుగా ఉంటున్నారన్న మోదీ
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, తాను ఎప్పటి నుంచో స్నేహితులమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆయన ప్రధాని కాకముందు నుంచే తనకు పరిచయం ఉందని అన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మలేసియా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి కమ్యూనిటీ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీం, మోదీ ఇద్దరూ ఒకే కారులో కలిసి కమ్యూనిటీ ప్రోగ్రామ్ వేదిక వద్దకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, భారత సంతతి సమాజం ఉన్న రెండో అతిపెద్ద దేశం మలేసియా అన్నారు. రోటీ కనై - మలబార్ పరోటా, కొబ్బరి, సుగంధ ద్రవ్యాలు వంటి పదార్థాలు కొచ్చిలో ఉన్నా, కౌలాలంపూర్‌లో ఉన్నా వీటి రుచులు ఇరు దేశాల ప్రజలకు సుపరిచితమే అన్నారు. మలేషియా ప్రధాని మంచి సింగర్ అని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఇటీవల ఆయన పాడిన ఒక భారతీయ పాట వీడియో వైరల్ అయిందని గుర్తు చేశారు.
2026లో తన తొలి విదేశీ పర్యటన ఇదేనని ఆయన గుర్తు చేశారు. అందరూ సంక్రాంతి పండుగ చేసుకుని ఉంటారని స్థానిక దక్షిణ భారత సంతతి ప్రజలను ఉద్దేశించి అన్నారు. తమిళ సంతతికి చెందిన వారు ఇక్కడ దశాబ్దాలుగా ఉంటున్నారని, వివిధ రంగాల్లో వారు సేవ చేస్తున్నారని కితాబిచ్చారు. భారతదేశ ప్రస్తుత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, కేంద్రమంత్రులు ఎస్ జైశంకర్, నిర్మలా సీతారామన్, ఎల్ మురుగన్ తమిళనాడుకు చెందినవారేనని తెలిపారు.