'వార్ 2' ల‌వ్ సాంగ్‌పై జూనియ‌ర్ ఎన్టీఆర్ అప్‌డేట్‌

  • హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్ కీల‌క పాత్ర‌లో 'వార్ 2'
  • అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం.. య‌శ్‌ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణం
  • హీరోయిన్‌గా కియారా అద్వానీ 
  • కియారా, హృతిక్ మ‌ధ్య వ‌చ్చే ల‌వ్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసిన మేక‌ర్స్ 
  • ఊపిరి ఊయ‌ల‌గా అంటూ సాగే ఈ పాట ప్రోమోను షేర్ చేసిన‌ తార‌క్  
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్‌, టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు ఎన్టీఆర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన తాజా చిత్రం 'వార్ 2'. అయాన్ ముఖ‌ర్జీ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా.. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ య‌శ్‌ రాజ్ ఫిల్మ్స్ మూవీని నిర్మించింది. కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టించారు. ఆగ‌స్టు 14న సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది. రిలీజ్‌కు ఇంకా 15 రోజులే మిగిలి ఉండ‌డంతో మేక‌ర్స్ జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. 

ఇప్ప‌టికే మూవీ ట్రైల‌ర్‌, టీజ‌ర్‌, పోస్ట‌ర్ల‌ను విడుద‌ల చేశారు. తాజాగా కియారా, హృతిక్ మ‌ధ్య వ‌చ్చే ల‌వ్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. తెలుగులో ఊపిరి ఊయ‌ల‌గా అంటూ సాగే ఈ పాట ప్రోమోను తార‌క్ త‌న 'ఎక్స్' ఖాతాలో షేర్ చేశారు. "ప్రేమ అప్రయత్నంగా ఉన్నప్పుడు, అది ఒక కలలా అనిపిస్తుంది... రేపు విడుదలయ్యే ఊపిరి ఊయలగా  పాట కోసం సిద్ధంగా ఉండండి!" అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. 


More Telugu News