Telangana: తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్.. రెండో వాహనంపై అదనపు పన్ను రద్దు
- తెలంగాణలో రెండో వాహనంపై 2 శాతం అదనపు పన్ను రద్దు
- రవాణా శాఖ ప్రతిపాదనకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్
- ప్రజలపై భారం తగ్గనుండగా, ప్రభుత్వానికి రూ.100 కోట్ల ఆదాయం కోత
- వాహన్ పోర్టల్‌లో సాంకేతిక సమస్యల కారణంగా ప్రభుత్వ నిర్ణయం
- త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం
తెలంగాణలో రెండో వాహనం కొనుగోలు చేసేవారికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించనుంది. రెండో వాహనం కొనుగోలుపై విధిస్తున్న 2 శాతం అదనపు జీవితకాల పన్నును (లైఫ్‌ట్యాక్స్) రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రవాణా శాఖ పంపిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో రెండో వాహనం కొనేవారు అదనంగా 2 శాతం పన్ను చెల్లిస్తున్నారు. ఉదాహరణకు రూ.1.20 లక్షల విలువైన బైక్‌ను రెండో వాహనంగా కొంటే రూ.2,400 అదనంగా కట్టాల్సి వస్తోంది. ఈ విధానం వల్ల ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ మొత్తం ఆదాయం తగ్గినా, ప్రజలపై ఆర్థిక భారం తగ్గుతుంది.
కాలుష్య నియంత్రణలో భాగంగా రెండో వాహనాల కొనుగోళ్లను నిరుత్సాహపరిచేందుకు గతంలో ఈ పన్నును ప్రవేశపెట్టారు. అయితే, చాలామంది ఈ పన్నును తప్పించుకోవడానికి తమ కుటుంబసభ్యుల పేర్ల మీద వాహనాలు రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. దీనివల్ల బీమా క్లెయిమ్‌ల సమయంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం జాతీయ డిజిటల్ ప్లాట్‌ఫామ్ 'వాహన్'లో చేరాలని నిర్ణయించింది. ఈ పోర్టల్‌లో ఒక వ్యక్తికి ఇదివరకే వాహనం ఉందో లేదో గుర్తించేందుకు ప్రత్యేక ఆప్షన్ లేదు. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించడం ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ఈ అదనపు పన్నును రద్దు చేయడమే సరైన మార్గమని రవాణా శాఖ ప్రభుత్వానికి సూచించింది. ఈ ప్రతిపాదనకు సీఎం అంగీకరించడంతో వాహనదారులకు త్వరలోనే శుభవార్త అందనుంది.