AR Rahman: ఆ విషయం మర్చిపోయా.. వివాదంపై ఏఆర్ రెహమాన్ ఫుల్ క్లారిటీ
- ఆ సంఘటనను మర్చిపోయి ముందుకు వెళ్తున్నానని వెల్లడి
- తెలిసిన వారికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్య
- బాలీవుడ్‌లో ఓ వర్గం తనకు వ్యతిరేకంగా పనిచేస్తోందని గతంలో ఆరోపణ
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, గతంలో తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మరోసారి స్పందించారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, ఆ సంఘటనను తాను మర్చిపోయి జీవితంలో ముందుకు సాగిపోతున్నానని స్పష్టం చేశారు. ఈ వివాదంపై మాట్లాడేందుకు మొదట నిరాకరించినప్పటికీ, చివరికి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
కొంతకాలం క్రితం ‘బీబీసీ ఏషియన్ నెట్‌వర్క్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెహమాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో ఓ వర్గం తనకు వ్యతిరేకంగా పనిచేస్తోందని, సృజనాత్మకత లేని వ్యక్తుల చేతుల్లో హిందీ పరిశ్రమ ఉందని ఆయన పేర్కొనడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సినీ ప్రముఖులు సైతం స్పందించారు.
ఈ వివాదంపై గతంలోనే సోషల్ మీడియా ద్వారా స్పందించిన రెహమాన్.. ఎవరినీ బాధపెట్టే ఉద్దేశం తనకు లేదని, భారతదేశం తనకు స్ఫూర్తి అని చెప్పారు. తాజాగా పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడుతూ, "మనమేంటో తెలిసినవారికి ప్రత్యేకంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ చెప్పినా వాళ్లు వినరు" అంటూ నవ్వుతూ బదులిచ్చారు. జీవితంలో కొన్ని విషయాల నుంచి త్వరగా బయటపడటం మంచిదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన తాజా వ్యాఖ్యలతో ఈ వివాదం సద్దుమణుగుతుందని అభిమానులు భావిస్తున్నారు.