మహిళా అభిమాని ఇచ్చిన రూ. 72 కోట్ల ఆస్తిని తిరిగిచ్చిన సంజయ్ దత్!
- సంజయ్ దత్ పేరిట ఆస్తిని రాసిన నిషా పటేల్
- తన తదనంతరం హీరోకు దక్కాలన్న నిషా పటేల్
- ఆస్తిని ఆమె కుటుంబానికే ఇచ్చినట్లు ఇంటర్వ్యూలో వెల్లడించిన సంజయ్ దత్
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న నిషా పటేల్ అనే అభిమాని అప్పట్లో తన ఎస్టేట్ మొత్తాన్ని సంజయ్ దత్ పేరు మీద రాశారు. ఆమె మరణించిన తర్వాత తన సంపద సంజయ్ దత్‌కు దక్కేలా వీలునామా రాశారు. సంజయ్ దత్‌కు అందేలా చూడాలని బ్యాంకులకు కూడా ఆమె సూచించినట్లు వార్తలు వచ్చాయి.
ఈ విషయంపై సంజయ్ దత్ మాట్లాడుతూ, ఆ ఆస్తిని ఆమె కుటుంబ సభ్యులకే ఇచ్చేశానని ఇంటర్వ్యూలో చెప్పారు.