ఈసారి జగన్ ను టార్గెట్ చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి!

  • పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వరా అంటూ జగన్ వ్యాఖ్యలు
  • తీవ్రస్థాయిలో స్పందించిన జేసీ
  • పెద్దారెడ్డిని రానిచ్చేది లేదంటూ స్పష్టీకరణ
  • ఒకవేళ వస్తే తాడిపత్రి ప్రజలే తిప్పికొడతారని వెల్లడి
కేతిరెడ్డి  పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వకపోడంపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. 

గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దారెడ్డి తన ఇంటిపైకి వచ్చాడని ఆరోపించారు. మీ తాత పెద్ద ఫ్యాక్షనిస్ట్  కదా... ఆయన కూడా ఎప్పుడూ ఇలా ప్రత్యర్థుల ఇళ్లలోకి వెళ్లలేదే అని జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మీ తాత చనిపోయిన రోజున మధ్యాహ్నం వరకు పరిస్థితి బాగానే ఉంది... కానీ ఇదే కేతిరెడ్డి కుటుంబం పులివెందుల వెళ్లి బీఎన్ రెడ్డి ఇంటిని తగలబెట్టారు... నీకు తెలియకపోతే మీ అమ్మని అడుగు జగన్ రెడ్డీ అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సూచించారు. 

కేతిరెడ్డి పెద్దారెడ్డిని సొంత ఇంటికి వెళ్లనివ్వరా అంటున్నావు... అసలు కేతిరెడ్డికి సొంత ఇల్లు ఉందా... అది మున్సిపాలిటీ స్థలం ఆక్రమించి కట్టుకున్న ఇల్లు అని ఆరోపించారు. ఎవరేమైనా అనుకోండి... కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానిచ్చేది లేదు... అతడి విషయంలో ఎంతదూరమైన వెళతాం... ఒక వేళ పెద్దారెడ్డి తాడిపత్రిలోకి ప్రవేశిస్తే ప్రజలే తిప్పికొడతారు అని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. 


More Telugu News